ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు – ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సోమవారం వెలువడిన ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేయాలనే నిర్ణయాన్ని ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు స్వాగతిస్తు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
సంక్షేమానికి కొత్త అర్ధాన్నిస్తూ కీలక పథకాలను అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, మనవీయకోణంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని, క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్ సాదం శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో, క్వీన్స్‌ల్యాండ్ BRS సభ్యులందరు ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తు సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగిందని, వారి గోసను అర్ధం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యుల్లో కొందరు ఆర్టీసీ కార్మికుల పిల్లలు కావడం విశేషం.
అలాగే 19 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయం, పటాన్‌చెరు – మేడ్చల్ – తుంకుంట వరకు మెట్రోరైలు విస్తరణ నిర్ణయాన్ని కూడా అభినందిస్తు ఆనందోత్సాహాలతో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మన తెలంగాణ బ్రిస్బేన్ వాసులు. ఇలాంటి సంస్కరణలు కేవలం కేసీఆర్ గారికే సాధ్యపడ్డాయని వాళ్లు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీకర్, విరించి తదితరులు పాల్గొన్నారు.