కామారెడ్డి A9 news.
ఎల్లారెడ్డి నియోజకవర్గం భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు విది దీపాల కింద కూర్చొని చదువుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది, అప్పట్లో మహాత్మా గాంధీ గారు దీపాల కింద కూర్చొని చదువుకొని గొప్పవాడయ్యాడని ఇప్పుడు భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతిరోజు వీధి దీపాల కింద కూర్చొని చదువుకోవడం భూంపల్లి గ్రామస్తులు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురయ్యారు. గాంధీ గారి అడుగుజాడలో నడుస్తూ విద్యార్థులు.
ఇంట్లో కూర్చొని చదువుకోకుండా వీధి దీపాల కింద కూర్చొని చదువుకోవడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అభినందన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ వీధిదీపాల కింద కూర్చొని పది రోజులపాటు చదువుకుంటున్నామని తెలిపారు. అప్పుడు గాంధీతాత కూడా దీపాల కింద కూర్చొని చదువుకొని గొప్పవాడు అయ్యారని మా తల్లిదండ్రులు చెప్పేవారని అన్నారు. ప్రతిరోజు వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటామని విద్యార్థులు అన్నారు.