
ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయము 4 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగర్ కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ లు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఎలాంటి సందర్భంలోనూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలియజేశారు. ఈ తనిఖీలు దాదాపు 100 పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 170 ఇండ్లు మరియు సరైన ధ్రువపత్రాలు లభించని 76 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు,1 కార్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్, ఏసిపి వెంకటేశ్వర్లు రెడ్డి, సిఐలు, సత్యనారాయణ గౌడ్, శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, 9 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.