అపూర్వ కలయిక
35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల:
A9 న్యూస్ వేల్పూర్:
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 35 సంవత్సరాల తర్వాత పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి ఆ పాత మధురాలను గుర్తు చేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒక దగ్గర చేరి ఆనాటి చిలిపి పనులను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులంతా ఒక దగ్గర చేరి ఒకరికొకరు వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చిన ఒకటిగా నిలబడతామని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రావణ్, రావిన్, రమేష్, రామ్మోహన్, హరికృష్ణ, సుభాష్, రమేష్, ముత్తన్న, అనంతరావు, శ్రీనివాస్, పద్మారావు, అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.