A9 న్యూస్ ఆర్మూర్:
-తెలంగాణ పండగలు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు
-నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ
తెలంగాణ పండగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ శేల్లి చౌదరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల నవ్య భారతి పాఠశాలలో బతుకమ్మ పండగ పురస్కరించుకొని ముందస్తు వేడుకలను జరుపుకోవాలని జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో పూజ చేసి, నైవేద్యo సమర్పించి బతుకమ్మ చుట్టూ కోలాటపాటలను పాడుతూ ఉత్సాహంగా గడపడం జరిగింది. సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శేల్లి చౌదరి, అంజు, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.