A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట మండలం డొంకేశ్వర గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులో మంజూరు విషయములో ఓ కాంట్రాక్టర్ వద్ద పని జరగాలంటే పని 7000/- రూపాయల లంచం ఇవ్వాలని అన్నారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబి అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డి.ఎస్.పి అధికారి శేఖర్ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు రిమాండ్ కు తరలించారు.