A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ ఎలక్ట్రానిక్స్, సౌండ్ అండ్ లైటింగ్ యూనియన్ సభ్యులు బదిలీపై నూతనంగా వచ్చిన ఆర్మూర్ ఏసీపీ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సభ్యులు తమ సమస్యల్ని ఏసీపీ దృష్టికి తెస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉండి ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, సీజన్ సమయంలో డీజే బ్యాన్ అనేసరికి ఇబ్బందికి గురయ్యామని, కనీసం తక్కువ సౌండ్ పెట్టి డీజేలకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద పెద్ద డీజే లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, బతుకమ్మల ఊరేగింపు, దుర్గామాత నిమజ్జన సమయంలో కూడా అట్టి డీజేలు ఆర్మూర్ కు వస్తే వాళ్లను అదుపులోకి తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఏసీపీ వేంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన నిజామాబాద్ సీపీ ఆదేశాల మేరకు పెద్ద శబ్దంతో వచ్చే డీజేలు పూర్తిగా బ్యాన్ చేసినట్టు వివరించారు. రెండు బాక్సులు పెట్టుకొని బతుకమ్మ సంబరాలు, దుర్గ మాత నిమజ్జనాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని వివరించారు. నిబంధనలకు అతిక్రమించి ఎక్కువ సౌండ్ పెడితే చట్టరీత్యా చర్య తీసుకొనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజనీష్ కిరాడ్, గణేష్, శివ, అనిల్, సాయి, శ్రీనివాస్, వినీత్ తదితరులు పాల్గొన్నారు.