A9 న్యూస్ హైదరాబాద్:
తెలంగాణలోబతుకమ్మ పండుగ రానే వచ్చేసింది, పల్లెలు పట్నాలు ఉయ్యాల పాటలతో మార్మోగనున్నాయి, తెలంగాణ ఆడపడు చులు ఆటపాటలతో అంగరంగా వైభవంగా జరుపుకుంటారు.
తీరొక్క పూలతో సాగే వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. పెత్తర అమా వాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై ఈనెల 10న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ సంస్కతికి చిహ్నం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది.
ప్రపంచంలో పూలను పూజించే అరుదైన పండుగ ఇది. జీవితమంతా సంతో షంగా సాగిపోవాలనేది బతుకమ్మ పండుగ ఆంత ర్యం. గునుగుపూలు తంగేడుపూలు, పట్టుకుచ్చు, బంతి, చామంతి, వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు.
సాయంత్రం ఇంటి ముందు, సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
బతుకమ్మలను చెరువులలో కుంటలలో సాగనంపిన తర్వాత నువ్వులు, బియ్యం, పల్లీల తో చేసిన సత్తు ముద్దలను మహిళలు నైవేద్యంగా భావించి ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చు కుంటారు.