A9 న్యూస్/ఎల్లారెడ్డి,నిజామాబాద్ రూరల్:

ఎల్లారెడ్డి పల్లెలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ వారి సౌజన్యంతో రక్త పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని స్నేహ సొసైటీ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సెక్రెటరీ ఎస్ .సిద్దయ్య తెలియజేశారు . రక్త పరీక్షలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రలను అందజేయడం జరుగుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ సిబ్బంది అన్విత, రాజశేఖర్ , కవిత ,మమత ,ఆరోగ్య శ్రీ సిబ్బంది లయ,ఇందిరా ,సుమలత ,ఆశా వర్కర్లు సుభద్ర ,అనూష తదితరులు పాల్గొనడం జరిగింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *