నిజామాబాద్ A9 news
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది అంటే దాని వెనకాల కేసీఆర్ కి వెన్నుదన్నుగా ఉండి, 1954 నుండి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని సజీవంగా ఉంచుతూ, ఆజన్మ బ్రహ్మచారిగా తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన లక్ష్యంగా జీవించిన మహోన్నత వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని, నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గుర్తు చేశారు.
ఈ శతాబ్దిలో తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలిచిపోతారని తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందిన ముగ్గురు బాధితులకు ఎమ్మెల్యే జీవన్ రెడీ కృషితో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్లసాగర్, జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, ఉప సర్పంచ్ భరత్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు మురళి,బజరంగ్, నందిపేట విడిసి అధ్యక్షులు పండరి రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంతెన శీను, నాగుల సుధాకర్, గాండ్ల సంతోష్, బుడ్డ వర్కల సాగర్, సందీప్, జూల రాజేందర్, కిషన్, ఏషాల చిన్నయ్య, లింగం, నాగుల మహిపాల్, మేకల శ్రీనివాస్, రవి, తరుణ్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.