Monday, November 25, 2024

పోలీస్ శాఖ ఆద్వర్యంలో కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ గారి 89 వ జయంతి వేడుకలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

తేది: 06-08-2023 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కీ॥శే॥ ప్రొఫెసర్ జయశంర్ గారి ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం, అదనపు పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ 1934 ఆగష్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని, 1952 సం॥ ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1954లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ముందు యువకుడైన జయశంకర్ ధాటిగా వాదించారు. కాకతీయ యూనివర్సీటీ వైస్ చాన్సలర్ గా ఎదిగారు. ఇలా 2001 సం॥లో టి.ఆర్.ఎస్. ఏర్పాటును స్వాగతించారు. టి.ఆర్.ఎస్ సైద్ధాంతిక పునాదిని తయారు చేశారు. లక్ష్యం సూటిగా ఉండా లని నమ్మినవ్యక్తి, ప్రత్యేక తెలంగాణ, సామాజిక తెలంగాణ అంటూ ముందుకొచ్చి ఉద్యమ ధోరణుల పట్లస్పందిస్తూ, భౌగోళిక తెలంగాణను సాధించుకొన్న తరువాతే మిగతాకోణాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుందని చెప్పేవారు. ” తెలంగాణ నా కల అని పదేపదే చెప్పేవారు” అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యం ప్రతి ఒక్కరు కష్టపడాలని, భావితరాల కోసం బంగారుబాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు పోలీస్ కమీషన్ గారు పిలుపునిచ్చారు.

ఈ జయంతి సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) శ్రీ గిరారాజ్, సి.సి.ఆర్.బి సి.ఐ శ్రీ సురేందర్ రెడ్డి రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శ్రీ వెంకటప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ శ్రీ బాల్సంగ్ నాయక్ ఆఫీస్ సూపరింటెండెంటులు శ్రీ శంకర్ శ్రీ మక్సూద్ హైమద్, శ్రీ గోవింద్ మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సి బ్బంది హాజరుకావడం జరిగింది.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here