A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో సిరి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి మరియు మొక్కజొన్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ అధిక దిగుబడి మరియు అధిక రాబడి కలిగించే తమ యొక్క ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రంజిత్ కుమార్, శ్రీనివాస్, ప్రమోద్, జువ్వన్నా, గంగారం, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.