*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా తీసుకువచ్చిన పథకాలు ఇందులో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రికమండేషన్ లకు తావు లేకుండా పారదర్శకంగా చేపట్టిన ఇలాంటి కార్యక్రమానికి మేము ఇప్పిస్తాము అని ఎవరైనా ఒక్క రూపాయి అడిగిన లేదా పర్సంటేజీలు అడిగిన వారిని నమ్మవద్దని నమ్మి మోసపోవద్దని ఇలాగా ఎవరైనా పర్సంటేజీలు అడిగిన దాఖలాలు ఉంటే మీరు దయచేసి మన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ని నేరుగా సంప్రదించవచ్చు. ఇట్టి విషయంలో వినయ్ అన్నగారు చాలా నిబద్ధతతో ఉన్నారు. నిజమైన లబ్ధిదారులకే ఇట్టి పథకాలు చేరే విధంగా కార్యకర్తలే వ్యవహరించాలని ప్రతి రోజు ప్రజాక్షేత్రంలో ఉండేది కార్యకర్తలే కాబట్టి ఇట్టి పథకాలు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా కార్యకర్తలపై ఎంతైనా ఉందని ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ పని చేసిన వారికే రానున్న రోజుల్లో పదవులు గాని మంచి భవిష్యత్తు ఉంటుందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారని దోండి రమణ అన్నారు. వాట్సప్ గ్రూపుల్లో లేనిపోనివి కల్పిస్తూ ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న వారికి సోషల్ మీడియాలో మీరు వెంటనే స్పందించాలని మన ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలు కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని చేరవేయవలసిన బాధ్యత కూడా మనందరిపై ఉందని బిజెపి బిఆర్ఎస్ లకు ధీటుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలన్నీ తిప్పి కొట్టాలని ఇట్టి సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ అన్నారు.