ఆర్మూర్ నియోజక వర్గంలో
————–
*కొత్తగా 5 గ్రామ పంచాయతీలు*
-ఫలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి
-సాకారమైన ప్రజల చిరకాల కోరిక
ఆర్మూర్, ఆగస్టు4:-
ఆర్మూర్ నియోజక వర్గంలోని వివిధ మండలాల్లో కొత్తగా 5 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న “పల్లె”, మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న “రామస్వామి క్యాంపు”, మాక్లూర్ మండలంలోని బొంకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న “మెట్టు”,
నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ” జోజిపేట్”, నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న “రైతుఫారం” గ్రామాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించాయి. ఈ 5 కొత్త గ్రామ పంచాయతీల ఆవిర్భావంతో ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 86కు చేరింది.
కాగా పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి కృషి ఫలించి తమ చిరకాల కోరిక సాకారమైందని ఈ 5 నూతన గ్రామ పంచాయతీల ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇదిలావుండగా ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్తగా 5 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడం పట్ల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జీవన్ రెడ్డి వారిని అభినందించారు.