AP ప్రతినిథి:
ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకుంటే జవాబుదారీ తనం తగ్గిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలే చొరవ తీసుకోవాలన్నారు. గ్రామస్థుల్లో చైతన్యం రాకుంటే తనలాంటి వారు 10 వేల మంది వచ్చినా ప్రయోజనం లేదని పవన్ తెలిపారు. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించాలన్నారు.