A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*బహుజనుల కోసం నూతన జాతీయ పొలిటికల్ పార్టీ నీ ఏర్పాటు చేయనున్న అబ్బగోని అశోక్ గౌడ్
బీసీల కోసం బీసీల పొలిటికల్ పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని బహుజనుల కోసం జాతీయ లో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు అబ్బగోని అశోక్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయపరంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారని అశోక్ గౌడ్ తెలియజేశారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మారట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని, ఈ డెమోక్రటిక్ కంట్రీలో స్వేచ్ఛను కల్పించారని ఆయన తెలియజేశారు. సావిత్రిబాయి, జ్యోతి బాపు పూలే ఆశయాలను కొనసాగించడానికి ఈ యొక్క పార్టీని ప్రారంభిస్తున్నామని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.
తెలంగాణ లో పార్టీ నిర్మించడానికి ముఖ్య కారణం:
ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలలో బీసీలకు సరైన స్థానం లేక పోవడం.. గద్ద కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలియజేశారు. ప్రభుత్వాలు మారిన పార్టీలు వేరైనా వారి పరిపాలన ఏజెండా మాత్రం ఒకటే.
బీసీలను బానిసలు చేసుకోని అగ్రవర్ణ పార్టీలు రాజ్యాధికారం కొనసాగిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి 70 శాతం బీసీలకు రాజ్యాధికారం రావడం లేదు. దీనికోసం అనేక బిసి సంఘాలు ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కలవడం లేదు. దానికి నిదర్శనం సరైనటువంటి బీసీల పొలిటికల్ పార్టీలు లేకపోవడం.. బీసీల యొక్క పార్టీ ఉండడంవల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని అందువల్ల ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. మా పార్టీ యొక్క సిద్ధాంతం
జనాభా తమాషా ప్రకారం బీసీలకు రావలసిన వాటా ప్రకారం కులగణన జరిపించాలని డిమాండ్. బీసీల పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం పట్ల అబ్బగొని అశోక్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డెకరేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట ఇంతవరకు నెరవేర్చకపోవడం పట్ల దాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టి, బీసీలు 90% పైగా ఉన్న ఈ దేశంలో మరియు రాష్ట్రంలో బహుజనులు ఇంకా బానిసలు గానే ఉండే పరిస్థితి నెలకొంది. కేవలం 10 శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, బీసీ కార్మికులు చేసుకునే జీవనం సాగిస్తున్నారు. వారికి సరైన ప్రోత్సాహం మరియు జీవనాధారం లేకుండా ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అదేవిధంగా బీసీ కార్మికుల పిల్లలు కూడా చివరకు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లు కూడా కులవృత్తులు లేదా ఏదో కార్మికులుగా పనిచేసుకునే పరిస్థితి ఏర్పడింది అని అబ్బ గోని అశోక్ గౌడ్ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ కామారెడ్డి బీసీ డెకరేషన్ కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. అందుకోసం మేము సైతం ఆ యొక్క దీక్షలో పాల్గొనడానికి కదిలి వెళ్తామని తెలియజేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు పూర్తిగా న్యాయం జరిపించేలా పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా బీసీ మహిళలకు మా పార్టీలో ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తామని తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమం తరువాత రాబోయేది బీసీల ఉద్యమమేనని బహుజనుల నూతన జాతీయ పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ అధ్యక్షుడు అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.