రాజ్యాంగ పరంగా లౌకిక వాదంగా పరిష్కారం చేసుకోవాలి….

On: Monday, October 13, 2025 7:58 AM

 

నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి

ఎ9 న్యూస్ ,సిద్దిపేట, అక్టోబర్ 13:

ప్రియమైన మేధావులారా ప్రజాస్వామ్యవాదులారా చట్టబద్ధ పరిపాలకులారా ఈరోజు ఈ దేశంలో ఒక కనీ విని ఎరుగని సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటన ముందు ముందు జరుగుతది కావచ్చు అనుకున్నాము. కానీ, ఈ సంఘటన మన కళ్ళముందే 150 కోట్ల భారత ప్రజల సాక్షిగా తెల్లవారి లేస్తే చట్టము రాజ్యాంగము అని గొంతు చించుకొని అరిషి ఏ సమస్యనైనా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లౌకికపరంగా పరిష్కరించుకోవాలి. అన్న మన ఆరాటం పోరాటం మొత్తం దేశానికే దిక్సూచి అయిన న్యాయవ్యవస్థకు రాజ్యాంగ యొక్క ఆత్మకు శారీరకంగా మానసికంగా బలమైన దెబ్బలే తగిలినాయి. ఈరోజు సనాతనన్ని కాపాడే ముసుగులో ఒక అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి పై దాడి చేయడం అంటే పీడితులు, తాడితులు, దళితులు ఒక్క మాటలో చెప్పాలి అంటే కుల మతాలతో సంబంధం లేకుండా బలహీనుడిపై బలవంతుడు చేసిన దాడిగానే కాకుండా ఈరోజుతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ పాటించేవారిని ఇకముందు మేము సహించబోమని హెచ్చరిక. ఈ దాడికి సంకేతం కాబట్టి బుద్ధి జీవులారా మేధావులారా ఇటువంటి తీవ్రతి తీవ్రమైన సంఘటనను మా “నిరుపేదల హక్కుల సాధన సమితి ” తీవ్రంగా ఖండిస్తుంది. అది గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ సీజై గవాయిపై దాడిగానే చూడటం లేదు. దానిని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పై దాడిగానే చూస్తున్నాం. కాబట్టి తెల్లవారు లేస్తే చట్టం రాజ్యాంగం గురించి మాట్లాడే మేధావులారా ఇప్పటికైనా మేల్కొనండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు ప్రజలను కూడా రక్షించవలసిన బాధ్యత మీపై ఉన్నది. అని కాంక్షిస్తూ పీడిత ప్రజల వైపు మీ గొంతు ఉండాలని కోరుకుంటున్నాం.

 

ఇట్లు/

నిరుపేదల హక్కుల సాధన సమితి

సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ,

జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి

11 Nov 2025

Leave a Comment