రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలు క్లియర్ 2025 అక్టోబర్ వరకు ఆర్థిక శాఖ చెల్లించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను తీర్చింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న బకాయిలను ఆర్థిక శాఖ పూర్తిగా చెల్లించింది. దీని వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గి, సౌలభ్యం కలుగుతుంది. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా భట్టి విక్రమార్క *ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.* ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. *దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.








