మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వినతి పత్రం…..

On: Tuesday, August 4, 2026 7:31 PM

ఎ9 న్యూస్: రామాయంపేట, ఆగస్టు ,3 :

మెదక్ జిల్లా యాక్సిడెంట్ జరిగిన దుర్ఘటన తెలిసిన విషయమే ఈ సందర్భంగా మంగళవారం నాడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తరపున రామాయంపేట మండల రెవెన్యూ అధికారి కి నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ఎన్ హెచ్ 44 హైవే వై జంక్షన్ వద్ద మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు మరియు టీచర్లు ప్రయాణిస్తున్న ఆటోను వెనకనుండి ఢీ కొట్టినందున 15 మంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది. ఇట్టి ప్రమాదమును కొంతవరకు అరికట్టడం కోసం బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు లోపలికి వచ్చే రోడ్డును బ్లాక్ చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు కౌన్సిల్ శంకర్ గౌడ్ జిల్లా కార్యదర్శి బిక్షపతి జిల్లా నాయకులు సిద్ధిరాములు పబ్బ సత్యం మాజీ పట్టణ అధ్యక్షులు భాను చందర్ కిసాన్ మోర్చా సంగయ్య శ్యాములు ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నగేష్ గౌడ్ షాదుల తదితరులు పాల్గొనడం జరిగింది.

04 Aug 2026

Leave a Comment