A9 న్యూస్, నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి–మెట్‌పల్లి ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కమ్మర్‌పల్లి ఎస్‌ఐ తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీసులు సుమారు గంటకు పైగా శ్రమించి దెబ్బతిన్న లారీలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో వాహనాల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.








