భూగర్భ జలాల పరిరక్షణకు జలసిరి….

On: Thursday, July 30, 2026 6:57 PM

A9 న్యూస్ సిరికొండ, జులై 30:

భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామంలో సర్పంచ్ జీల మల్లేష్ ఆధ్వర్యంలో జలసిరి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించాలని గ్రామస్థులకు సూచించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, గ్రామ కార్యదర్శి విజయ్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

30 Jul 2026

Leave a Comment