ఆర్మూర్, ఆగస్టు 3:
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ బస్టాండ్ ఆవరణలో సోమవారం పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఏఎస్ఐ సుశీల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించాలన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది దినేష్, సదానందం, అరుణ్, తిరుపతి, ప్రశాంత్, రాహుల్, సురేష్ పాల్గొన్నారు.








