అంకాపూర్‌లో 20 గంజాయి ప్యాకెట్ల స్వాధీనం – ముగ్గురు అరెస్ట్….

On: Monday, August 3, 2026 7:39 PM

A9న్యూస్ ,3 ,ఆగస్ట్ ,సోమవారం.

ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ కూరగాయల మార్కెట్ సమీపంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 20 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిజామాబాద్ వైపు నుంచి పల్సర్ మోటార్ సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారు బైక్‌ను అక్కడే వదిలి పారిపోవడానికి యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటాడి ముగ్గురినీ పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న మోటార్ సైకిల్‌ను పంచుల సమక్షంలో తనిఖీ చేయగా 20 చిన్న గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గోవింద్‌పేట గ్రామానికి చెందిన ఆకుల అజయ్ (26), బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ (18), మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌లోని సాన్వీ కాలనీకి చెందిన మహమ్మద్ ముజాహిద్ అలియాస్ (ముజీబ్) 20 ప్యాకెట్లను అరెస్టు చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయం, రవాణా, వినియోగం వంటి మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని సీఐ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు.

04 Aug 2026

Leave a Comment