ఆలూరు మండలం గుత్పలోని సి.పి.ఆర్.ఎం హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. నేడు విడుదలైన ఫలితాలలో పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు.
ఈ సందర్భంగా బాశెట్టి అక్షిత 552 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, పొలాస హరిణి 535 మార్కులు, కర్రోళ్ల సాయి భరత్ 530 మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ చూపించారు. అదేవిధంగా మొత్తం 12 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం.
పాఠశాల 100 శాతం ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మరియు TRSMA జిల్లా అధ్యక్షులు రాస నిత్యానందం అభినందించారు.








