మోక్ష నంద ఆశ్రమం నుండి కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభించిన స్వాములు
భీంగల్ ఏప్రిల్ 21 (సదాశివ్ A9 న్యూస్) భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలోని మోక్ష నంద ఆశ్రమం (వాగు గడ్డ) భీంగల్ నుండి ప్రతి సంవత్సరం అంజన్న మాలలు వేసుకున్న స్వాములు పాదయాత్ర చేయడం జరుగుతుంది. స్వాములు మాట్లాడుతూ: ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందని పాదయాత్ర చేయడం వల్ల తాము కోరిన కోరికలు జరుగుతాయని ప్రగాఢ విశ్వసమని తెలిపారు. ఈ పాదయాత్రలో భగవంతుని దగ్గరికి కొండగట్టుకి చెరుకోవటం వల్ల శనీశ్వరుడు వదిలిపెడతాడని ప్రసిద్ధి ఉంది అని తెలిపారు. ఈ . పాదయాత్రలో తోగిటి నవీన్ ,నవ తేజ్, రామ గౌడ్ , భరత్, శ్యామ్ పాల్గొన్నారు.