A9 న్యూస్ ప్రతినిధి:
శ్రామిక రాజ్య సాధనకై పార్టీ ఆవిర్భావ దిన స్ఫూర్తితో పోరాడుదామని సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు కార్యకర్తలకు సమాచారం పిలుపునిచ్చారు. పార్టీ 55వ ఆవిర్భావ దినోత్సవం, లెనిన్ 154 వై జయంతిని పునస్కరించుకొని న్యూ డెమోక్రసీ ఆఫీస్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం దాసు మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం, శ్రమ దోపిడీ తీవ్రమైందని, కష్టజీవులను ఐక్యంగా కదిలించడంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీలు వెనుకబడడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యవంతమైన దేశాన్ని అప్పుల కొంపగా, ఆకలి, అసమానతలకు నిలయంగా పాలకవర్గ పార్టీలు మార్చాయని ఆయన అన్నారు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 111 స్థానంలో ఉందని, పోషకాహార లోపంతో కోటీ 70 లక్షల మంది మరణించడమే కాకుండా, 9 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో లక్ష 500 మంది ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. వ్యవసాయం పారిశ్రామిక రంగం ప్రమాదంలో నెట్టబడుతుందని, కార్పొరేట్ అధిపతులకు 25 లక్షల రుణమాఫీ చేసి, మోడీ ఏటా రెండు కోట్ల కొలువుల హామీను విస్మరించి, 23 కోట్ల మంది కటిక పేదరికంలో ఉండేటట్లు వివరించాడని ఆక్స్ఫాం నివేదిక వెల్లడించిందని ఆయన తెలిపారు. దేశ సంపద ధనవంతులైన ఒక్క శాతం మంది ఆధీనంలో 40 పాయింటు ఒక శాతం కేంద్రీకృతం కాగా దేశ జనాభాలో 50 శాతం ప్రజల చేతుల్లో మూడు శాతం సంపద ఉండడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల బహిరంగ వేలం, చిన్న మద్య తరగతి పరిశ్రమలు ఆరు లక్షలు మూతపడ్డాయని, ఎన్నికల వాగ్దానాలు బిజెపి గాలికి వదిలి, మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టడం చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో మెజార్టీ హిందువులు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలతో బజారు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ లేకుండా చరిత్రలో మార్పు లేదని, పీడిత ప్రజలను కూడగట్టి, శ్రామిక రాజ్య సాధనకై ఐక్య పోరాటాలను నిర్మిద్దామని దాసు పిలుపును ఇచ్చారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి సూర్య శివాజీ, పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకులు ఎండి కాజా మొయినుద్దీన్, రవి, ప్రిన్స్, లక్ష్మక్క, ధనలక్ష్మి, చరణ్, పాషా బాయ్, లోకేష్, నిశాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
H.No:1-86/15/1
Annapurna Colony , Kota Armoor , ARMOOR.
District: Nizamabad, Telangana India.
+91 94406 21911