A9న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
*నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా
*రైతుల పేరుట దళారుల రాజ్యం
* ఇటు నూతన రోడ్డు పనులు, అటు భారీ వాహనాల ప్రయాణం
*నిజామాబాద్ జిల్లాలో పబ్లిక్ కామెంట్స్
*ఎస్సారెస్పీ, రోడ్డు భవనాల, ఇరిగేషన్ శాఖల అధికారుల నిర్లక్ష్యం, లోకేశ్వరం, నందిపేట్ రెవెన్యూ సిబ్బంది నిర్వాకం
* భారీ వాహనాలు వెళ్లడంతో భయం లో ప్రయాణికులు
*నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం
*చోద్యం చేస్తున్న అధికారులు
*డబ్బే దేయంగా పనిచేస్తున్న దళారులకు చెక్ పెట్టే ది ఎవరు
*ఈ దందాపై అధికారులు కొరడా చూపిస్తారా-?
*లేకుంటే డబ్బుకు ఆశపడి మట్టి తరలింపుకు సహకరిస్తారా-?
గోదావరి సాక్షిగా నల్ల బంగారం అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటుతున్న ఎటువంటి పర్మిషన్లు లేకున్నా అధికారులు చూసి చూడడం వల్ల దళారులు రైతుల పేరిట దండుకుంటున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామ శివారు నుండి మట్టి జిల్లా సరిహద్దు దాటుకొని నందిపేట్ మండలం దాటి ఆలూరు మండల కేంద్రానికి భారీ భారీ కంటైనర్లలో రావడం విస్మయానికి గురిచేస్తుంది. నల్ల మట్టి రైతులు పొలాల్లోకి వాడుకోవాలి అనుకున్న ఎస్.ఆర్.ఎస్.పి నీటిపారుదల శాఖ అధికారుల పర్మిషన్ మరియు స్థానిక రెవెన్యూ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి, కానీ దళారులు అధికారులకు ముడుపులు అందించడంతో వీడీసీ సభ్యుల పేరిట కాంట్రాక్టర్లకు అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి నల్ల మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న మైనింగ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఎస్.ఆర్.ఎస్.పి లో భూములు కోల్పోయిన గ్రామ లకు ఆ భూములను ఇతరులకు ఇచ్చే అధికారం లేదు. కానీ వీడీసీ సభ్యులు కాంట్రాక్టర్లకు మట్టిని తవ్వుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు మట్టి దందాకు కళ్లెం వేయాలి కానీ వారు చూసి చూడనట్టు ఉండడంతో దళారులు మరింత రెచ్చిపోతున్నారు. అక్కడి నుండి మట్టిని సేకరించి పొలాల పేరిట ఇటుక బట్టీలకు తరలిస్తుండడం కొసమెరుపు. అంతేకాకుండా నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పంచగూడ బ్రిడ్జి, రోడ్డు, రోడ్డు నిర్మాణ పనులు తుది దశలో నడుస్తున్నాయి. ఇటుపక్క రోడ్డు పనులు నడుస్తుండగానే దానిపైనే భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు నాణ్యత దెబ్బతింటుందని, ఒకవేళ రోడ్డు నాణ్యత దెబ్బతింటే మరమ్మత్తులు చేయడం కష్టమేనని ప్రజలు భయపడుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో వాహనాలు వెళుతున్న రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ అధికారులకు ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు. నిర్మల్ జిల్లా పంచగుడి పరివాహక ప్రాంతంలో పశువులకు మేతమేయడానికి అటవీ ప్రాంతం లేదు. గోదావరి నది వరద వృద్ధితి తగ్గినప్పుడు మాత్రమే పశువులు గోదావరి పరివాహక ప్రాంతంలో గడ్డిని మేసి ఆకలి తీర్చుకుంటాయి. కానీ మట్టి బకాసురులు మట్టి కోసం తొవ్విన గుంతలు భారీ సంఖ్యలో ఉండటం వలన వర్షాకాలంలో పశువులు ఆ గుంతలలో చిక్కుకొని మరణించే అవకాశం ఉంది. ఇదేవి తమకు పట్టనట్లు డబ్బే దేయంగా పనిచేస్తున్న దళారులకు చెక్ పెట్టే ది ఎవరు అనేది అక్కడి ప్రజలలో ఉన్న సందిగ్ధత. నిజామాబాద్ జిల్లాతో పోల్చుకుంటే నిర్మల్ జిల్లాలో పసుపు సాగు తక్కువే అందుకే అక్కడి ప్రజలు నల్లమట్టిపై ఆసక్తి చూపించారు కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత ప్రజలు పసుపు సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో నల్ల మట్టి పై ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు దీన్ని అదునుగా చూసుకున్న దళారులు అక్కడి జిల్లా నుండి ఇక్కడి జిల్లాకు మట్టిని తరలిస్తున్నారు. ఈ దందాపై అధికారులు కొరడా చూపిస్తారా-? లేకుంటే డబ్బుకు ఆశపడి మట్టి తరలింపుకు సహకరిస్తారా-? అనేది వేచి చూడాలి. అంతేకాకుండా ఆలూరు మండలం కేంద్రంలోని దేగ్గం గ్రామ సమీపంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ ప్రయాణికుల మీదికి దూసుకు వచ్చింది ప్రయాణికులు జాగ్రత్త పాడడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంత జరుగుతున్న నిబంధనల ప్రకారం కాకుండా మట్టిని కొల్లగొడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు.