నిజామాబాద్ జిల్లా A9 news
నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో 35 వేల 317 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడీ కి పాలాభిషేకం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి పార్టీ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని దేశానికి అన్నం పెడుతున్న రైతుకు, బిఆర్ఎస్ పార్టీ వెన్నెముకని రైతుల శ్రేయస్సు కోసం, రైతుబంధు రైతు బీమా రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన విత్తనాలు ఎరువులు, చేతికొచ్చిన పంటకు మద్దతు ధర ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, గోదావరి నదికి వెనకకు అడుగులు నేర్పి కాలేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకువచ్చిన ఘనత కేసిఆర్ దే అని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్లసాగర్, మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ పట్టణ అధ్యక్షుడు భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, ఉపసర్పంచ్ భరత్, ఎంపీటీసీ బజరంగ్, వార్డు మెంబర్లు భూమేష్ మాన్పూర్, గంధం సాయిలు, క్లబ్ గంగాధర్, రాపల్లి రమేష్, తలవేద రాజేందర్, సలీం, రఫీ ఖాన్, మాజీ ఎంపీటీసీ హైమద్ ఖాన్, యూత్ నాయకులు దుబాయ్ శీను, దినేష్, గంధం రాజశేఖర్, ఆర్మూర్ శ్రీకాంత్, రాజు, బెంగళూరు సురేష్, దర్వాడి అనిల్, లోకం సంజయ్, శేఖర్, గణేష్, చేతన్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.*