నిజామాబాద్ జిల్లా A9 news
సిపిఎం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల మూలంగా అకాల వర్షాలకు వరదలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇండ్లు మునిగిపోయి సర్వస్వం వరదల్లో కొట్టుకుపోవడం తో పాటు నిరాశ్రయులైన పేదలకు ఆదుకోవటం కొరకు మరియు అనేక చెరువులు, వాగులు వరదలతో ఉప్పొంగి కట్టలు తెగి పంట పొలాల్లో ఇసుకమేటలు వేయడంతో పాటు పంటలు మునిగిపోయి రైతాంగం తీవ్ర నష్టాలకు గురవుటం జరిగింది. వారిని ఆదుకోవటానికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఒకరోజు విరాళాల సేకరణకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో విరాళాల సేకరణ చేయడం జరిగింది. వచ్చిన విరాళాలను రాష్ట్ర కేంద్రం ద్వారా బాధితులకు అందజేయడం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలియజేశారు. వరద బాధితుల సహాయార్థం సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను విడుదల చేసి ప్రజలను రైతులను ఆదుకోవాలని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల రాబట్టడం పై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు విశాల్, గణేష్, సాయిలు అనిల్ తదితరులు పాల్గొన్నారు.