మార్చ్ 26 :సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ, పురానిపేట గ్రామాలను ఎం పి డి ఓ సంతోష్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించినారు మరియు గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి పారిశుద్ధము నీటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినారు. మరియు గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపిఓ జి నర్సయ్య మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.