A9 న్యూస్ద్ ప్రతినిది కమ్మర్పల్లి:

కమలాకర్ డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్, తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) -2024కి సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ కు ఈనెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అయితే ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన పీజుభారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు 2021లో 200,2022 లో 300,2023 గతేడాది 2 పేపర్లకు కలిపి రూ.400 ఫీజు నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో ఒక పేపరకు దరఖాస్తు చేసుకంటే రూ. వెయ్యి, రెండు పేపర్లకు రూ.2వేలు చెల్లించాల్సి వస్తుందని, ఒకేసారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందికి గురవుతారని, ప్రభుత్వం నిరుద్యోగుల పైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేసేటటువంటి వైఖరి సరికాదని అన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోవు ఆనడానికి నిదర్శనం ఇదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ పీజులు వసూలు చేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేడు అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు.ప్రజా ప్రభుత్వమంటే ఇదేనాప్రజా ప్రభుత్వమంటే…పీజుల పెంచడం, నిరుద్యోగులపై భారం మోపడమేనా..? పీజులను 150-300 శాతం పెంచడమేనా. ? టెట్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలి. పెంచిన ఫీజాలను తగ్గించాలని డిమాండ్ చేస్తుంది అన్నాడు. లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. ఈ ఉద్యమంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పుడు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని. కమలాకర్డ ఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *