Monday, November 25, 2024

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి -మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రేడ్డి డిమాండ్

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

మర్చి 26.:సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

*ఊరూరా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి వరికి క్వింటాలుకు MSP ధరకంటే అదనంగా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి.*

 

*ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు..*

*మీరు చెప్పిన 100 రోజుల గడువు ముగిసింది..*

*రైతులకు చెప్పిన 2 లక్షల రుణమాఫీ వెంటనే,రైతు భరోసా సంపూర్ణగా అమలు చేయాలి..*

*ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రైతులు,ప్రజల పక్షాన పోరాటం చేస్తాం,ప్రశ్నిస్తాము,ప్రజా కోర్టులో నిలదీస్తాం.*

*మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి*

 

 

 

మీరే చెప్పిన 100 రోజుల గడువు పూర్తయింది కాబట్టి ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని..లేకుంటే ఈ పార్లమెంట్ ఏన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

 

 ఈరోజు వేల్పూర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడారు.

మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని సామెత ఉంది..

మా ప్రభుత్వ హయాంలో రైతులకు పుష్కలమైన సాగు నీరు,24 గంటల కరెంట్,రైతుబందు ఇచ్చాము..

 ఇప్పుడు రాష్ట్రంలో, అలాగే జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది

110 రోజుల కాంగ్రెస్ పరి పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు, సాగునీరు సరిగా ఇవ్వక..ఎండిపోయిన బోర్లు,కాలిపోతున్న మోటార్లతో రైతులకు దుఃఖమే మిగిలింది.కాంగ్రెస్ తెచ్చిన కరువుతో పంటలు ఎండుతున్నా ఈ ప్రభుత్వము చోద్యం చూస్తుంది

మా BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా కింద గోదావరి నుంచి నీళ్లను శ్రీరామ్ సాగర్ తీసుకొచ్చి తద్వారా వరద కాలువ,కాకతీయ కెనాల్ సంవత్సరం పొడుతా నిండుగా ఉంచి రైతులకు నీళ్లు అందించామని గుర్తు చేస్తున్నాం..

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు రైతులు సాగునీరు అడుగుతుంటే పంటలకు నీళ్లు ఇవ్వలేక పోతున్నారు..పైపెచ్చు పోచంపాడ్ డ్యామ్ నుండి వరద కాలువ ద్వారా ఆలోకేషన్ కంటే ఎక్కువ నీరు కిందికి తరలిస్తూ ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు.దీనికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి.

 

 

 

కప్పల వాగు,పెద్ద వాగులలో ఆనేక చెక్ డ్యామ్ లు మా ప్రభుత్వ హయాంలో నిర్మించాము. ప్యాకేజ్ 21 ద్వారా కప్పల వాగు,పెద్దవాగు లో నీళ్లు కూడా వదిలి వాటిని నీటితో నింపినట్లైతే ఆ వాగు వెంబడి ఉన్న గ్రామాల్లో బోర్లలో నీళ్లు వచ్చి సుమారు 40 వేల ఎకరాలకు లాభమయ్యేది..వాగులల్లో ఒక 0.5 TMC నీరు వదలమని ఎన్ని సార్లు రైతుల తరపున విన్నవించిన,లేఖలు రాసిన ఈ చెవిటి ప్రభుత్వం పట్టించుకోలేదు..ఇది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి..

 

రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఎం చెప్పారు..ఇప్పుడు ఎం చేస్తున్నారు.రైతులకు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చి వాటిని 100 రోజులలో 6 మలు చేస్తామని చెప్పి నట్టేటా ముంచారు..కాంగ్రెస్ ఎం మొహం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడుగుతుంది

 

మేము అధికారంలోకి రాగానే,వచ్చేనెల డిసెంబర్ లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం,ఒకవేళ రుణం మాఫీ అయిన రైతులు ఉంటే మళ్ళీ బ్యాంక్ కి వెళ్లి 2 లక్షలు రుణం తెచ్చుకోండి, మేము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలోకి వచ్చి 110 రోజులు కూడా గడిచింది. వెంటనే రైతు రుణమాఫీ చేయాలి. 

 

ఇప్పుడేమో బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు ఇస్తున్నారు

రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకూ సంబంధం లేదని రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారు.

రైతులెవరు బ్యాంక్ రుణాలు కట్టనవసరం లేదు..మీ పక్షాన BRS పార్టీ ఉంటుంది.

కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రుణమఫి హామీని నెరవేర్చకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు అడిగే నైతిక హక్కు మీ కాంగ్రెస్ పార్టీ కి లేదు..

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మరొక హామీ రైతు భరోసా ..

సంవత్సరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి 15000 రూపాయల రైతు భరోసా పంట సహాయం చేస్తామన్నారు.

 

 

BRS ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనులు మొదలు కాకముందే టంచనుగా ఎకరానికి 10 వేల పంట పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం ద్వారా అందజేసాం..కరోన లాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ఆదాయం తగ్గిన రైతులకు పంట సహాయం చేయడం రైతు పక్షపాతి అయిన కేసీఆర్ గారు ఆపలేదు.

ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మరియు కౌలు రైతులకు కూడా పంట సహాయం ఇస్తామని హామీ ఇచ్చింది.

ఇప్పటి వరకు 3 ఎకరాల కు మించి ఉన్న రైతులకు పంట.పెట్టుబడి డబ్బులు వేయలేదు..

 

మేము ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతాంగం పక్షనా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇస్తామని చెప్పిన విధంగా ఒక పంటకు ఎకరానికి 7500 ఇవ్వాలి.అంటే ఇదివరకే గతంలో లాగా 3 ఎకరాల లోపు 5000 చొప్పున రైతు భరోసా అందిన రైతులకు అదనంగా ఇంకా 2500 చెల్లించాలి.

 

చాలా మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదు.వారికి కూడా ఈ యాసంగి పంటకి ఎకరానికి 7500 చొప్పున చెల్లించాలి..

 

ఎన్నికల కోడ్ సాయానికి అడ్డు కాకూడదు.

మేము ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ లాగా ఎలక్షన్ కమీషన్ వారికి పిర్యాదు చేయం.రైతులకు సాయం విషయం లో రాజకీయాలకు పాల్పడం 

రాజకీయాలు మాని రైతులకు మేలు చేయండి.

 

కాంగ్రెస్ ఇచ్చిన 15 వేలు రైతుల భరోసా హామీ నెరవేర్చుకుంటే కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. 

 

కరెంట్,సాగు నీరు సక్కగా ఇవ్వకున్న రైతులు సచ్చో చెడో పంటలు పండించారు..కోతలు కూడా మొదలయ్యాయి..పంటలు చేతికొచ్చినయి.

కాబట్టి ప్రస్తుతం అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అంశం…క్వింటాలు కి 500 బోనస్ ఇచ్చి వరి ధాన్య సేకరణ గత ప్రభుత్వం లో లాగా ఈ ప్రభుత్వం ఊరూరా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలి.రైతుల నుండి ప్రతి గింజ కొనాలి.

 

గతంలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం జిల్లాలో సుమారు 490 ,బాల్కొండ నియోజకవర్గంలో 100 కు పైగా ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి గింజ కొనుగోలు చేయడమే కాకుండా కొన్న వారం,పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసాము.

 

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరికి MSP ధర కంటే అదనంగా క్వింటాలు కు 500 రూ బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది.వారి ఆరు గ్యారంటీలో పొందు పరించింది..అలాగే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన దానిని వివరిస్తూ వరి కి క్వింటాలుకు MSP ధర కంటే అదనంగా 500 రూపాయలు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

 

ఇప్పుడు వరి క్వింటాలు రూ : 2200 ధర ఉంది, మీరిచ్చిన మాట ప్రకారం 500 బోనస్ కలిపి 2700 రూపాయలు క్వింటాలకు ఇచ్చి రైతుల నుండి పంట కొనుగోలు చేయాలి..

 

లేకుంటే బోనస్ ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, రైతుల. పక్షాన పోరాడుతాము, రైతులు కూడా మీ మీ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులపై ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తేవాలి

 

ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.

 

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం వెళ్లదీస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడుతాం..రానున్న రోజుల్లో అనేక వేదికల్లో నిలదీస్తం.

 

రైతుల కిచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తాం అన్నారు..110 రోజులు గడిచింది.ఈ హామీలేవి నెరవేర్చకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఓట్లు అడుగుతారు..కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి.. రైతన్నలు ఒకసారి ఆలోచించాలి.

అందుకే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను..BRS పార్టీ ని 100 ఫీట్ల లోతులో బొంద పెడుతా,కేసీఆర్ ప్యాంట్ ఇప్పుతా,కింద పండబెట్టి తొక్కుతా,పేగులు మెడలో వేసుకుంటా అని చిల్లర మాటలు మానేసి ముందు మీరు తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చినట్టు ఇప్పుడు కల్లాల మీదకు రాబోయే వరి ధాన్యాన్ని క్వింటాలుకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆఖరి గింజ వరకు కొన్న తర్వాతనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తున్నాము అని ఎమ్మెల్యే అన్నారు

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు,ఎంపిపి,జెడ్పిటిసి లు మండల రైతుబందు సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here