నిజాంబాద్ జిల్లా [ A9 న్యూస్] నవంబర్ 19
బహుజన లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి వారి చదువును బట్టి ఉద్యోగాలను కేటాయిస్తామని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ గేస్ట్ ఫ్యాకల్టీ లను పర్మినెంట్ చేస్తామని, మహిళా బీడీ కార్మికులకు 10 లక్షల ఇసుగ్రేషియా తో పాటు వారికి జీవన భృతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పదివేల రూపాయల సాధనకై కృషి చేస్తా మనీ తెలియజేశారు.
గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 5000 కోట్ల రూపాయలు బడ్జెట్ కోసం కృషి చేస్తామన్నారు. భూమిలేని ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని తెలియజేశారు. కులవృత్తులతో పోలిన పరిశ్రమల స్థాపన సంబంధించిన కులాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. ప్రతి కుటుంబానికి 30 లక్షల రూపాయల విలువచేసే గృహ నిర్మాణం చేయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా బహుజనులకు వ్యాపారంగంలో ప్రత్యేక కేటాయింపులు చేయిస్తామన్నారు. పీడిత కులాల ఉత్పత్తుల అభివృద్ధికి బ్యాంకింగ్ రంగంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజకీయ రంగాలలో వార్డు స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని కులాలకు తెగలకు వారి వారి జనాభా ధమాష అను గుణంగా ప్రాతినిధ్యలు సీట్లు కేటాయింపులు చేయిస్తామన్నారు.
ఎల్కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉచిత వైద్యం చేయిస్తామని తెలియజేశారు. అర్హత కలిగిన వారికి ఇల్లుని కట్టిస్తామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. అదేవిధంగా గీత కార్మికులకు ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని తెలియజేశారు. తనను అసెంబ్లీకి పంపిస్తే
బీసీల కోసం అనునిత్యం కుల గణన జరిగే వరకు పోరాడుతామని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.