నిజామాబాద్ జిల్లా [A9 న్యూస్] నవంబర్ 19
ఆర్మూర్ మండల కేంద్రంలోని జండా గల్లి టీచర్స్ కాలనీ, 31 36 వార్డులలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా భారీ ఎత్తున మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో జెండా గల్లి టీచర్స్ కాలనీ యువకులు మహిళలు వృద్ధులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 31,36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి, వినయ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేడం ఖాయమని ఆయన అన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఎక్కడికి వెళ్ళినా ప్రజల మద్దతు పూర్తిగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశలో ఉందని, ప్రతిపక్ష పార్టీలకు ఓడిపోతామని భయం పుట్టుకుందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ బిజెపి రెండు మిత్ర పక్షాలని, వారి నమ్మకూడదని ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్లకు వెయ్యొద్దని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు మిత్రపక్షంలో ఉండి రాష్ట్రంలో పేదల భూములను దోచుకుంటున్నయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాగానే 6 గ్యారంటీలైనా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు.
గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు.
రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు,
చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు.
యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను కూడా కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 ఉద్యోగం కోసం తేదీలతో సహా నోటిఫికేషన్లు ఇచ్చామని ఆయన అన్నారు. ఈ ప్రచారంలో భారీ ఎత్తున మహిళలు,యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0