నిజామాబాద్ జిల్లా A9 న్యూస్

నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో మంగళవారం రోజున భారతదేశ తొలి ప్రధాని స్వతంత్ర సమరయోధుడు విద్యావేత్త జవహర్ లాల్ నెహ్రూ 134 జయంతిని పునస్కరించుకొని. ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర్ జవహర్ లాల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి నవభారత నిర్మాతలని కొనియాడారు, అలాగే పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు వివిధ సబ్జెక్టులు విద్యా బోధను బోధించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో *ఉపాధ్యాయుల బృందం* ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర్. జయం దేవగౌడ్. సాయినాథ్. బాబాగౌడ్. శంకరయ్య. గంగాధర్. ఉపాధ్యాయురాలు. వనజరాణి. లక్ష్మి. మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *