నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ నగర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యకర్తల సభ్యుల విస్తృత సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలపై నిత్యవసర సరుకుల ధరలను మోపిన బిజెపి పార్టీ ప్రజా సంపదతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలను తెచ్చే పద్ధతుల్లో నిర్ణయాలు చేయటం మూలంగా ప్రజల పైన ధారాలు పెరిగిపోయాయని అదేవిధంగా,

ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో బిజెపిని ఓడించటానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపిని సమర్థించే వ్యక్తులను ఓడించాలని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకు ఇచ్చిన ఇన్ రెండు పడకల ఇండ్లు, ఇండ్ల స్థలాల హామీని మరిచిందని దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలను పట్టించుకోని వ్యక్తులను, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ రాములు మాట్లాడుతూ మతోన్మాద భావజాలాన్ని పెంచి రాజకీయాల కోసం వాడుకోవటం సరైంది కాదని మతతత్వ విధానాలను అనుసరించే బిజెపిని, ఎంఐఎం ను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నగర్ కార్యదర్శి పెద్దిసూరి నగర నాయకులు సుజాత, కటారి రాములు, నరసయ్య, డి.కృష్ణ, అనసూయమ్మ, మునవర్,కళావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *