రాత్రి ఇంటి ముందున్న బైకులని టార్గెట్ చేసిన దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో బైక్ దొంగతనాలు ఒంటరి మహిళలపై చైన్స్ స్నాచింగ్ అలాగే దేవాలయాలను మరియు తాళం వేసిన ఇండ్లని టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు నిద్రమత్తులో అధికారులు ఐడి పార్టీ బృందం..
మాక్లుర్ మండల వ్యాప్తంగా పదుల సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన పోలిస్ ఫిర్యాదులు ఉన్న తేల్చని పోలీస్, స్పెషల్ పార్టీ బృందాలు, ఐడి బృందాలు
ఇటీవల కాలంలో మాక్లూర్ మండలంలోని మితిమీరిన దొంగతనాలు జరిగాయి. దొంగతనం జరగని గ్రామము లేదు దేవాలయము లేదు అన్నట్టుగా మండలంలోని గ్రామాల పరిస్థితి మండల వ్యాప్తంగా పదుల సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదులు చేసిన ఎటు తేల్చని పోలీస్ అధికారులు ఐడి బృందాలు ముఖ్యంగా దొంగలు ఒంటరిగా ఉన్న మహిళలు అలాగే తాళం వేసిన ఇండ్లను రద్దీగా ఉండే దేవాలయాలని టార్గెట్గా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు మండల వ్యాప్తంగా దొంగతనాలు జరగని గ్రామం అంటూ దేవాలయం లేదని తెలిసి చెప్పవచ్చు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఎటువంటి చలనం లేకుండా ప్రవర్తిస్తున్న తీరును మండల వ్యాప్తంగా భయాందోళనగా ఉందని మండల వ్యాప్తంగా గ్రామాల్లోని ప్రజలు గంటపదంగా తేల్చి చెప్తున్నారు ఇటీవల కాలంలోని చిక్లి ,గుంజిలీ, కొత్తపల్లి ,గొట్టుముక్కల ,ముల్లంగి ,డికంపల్లి,దర్మారం,గుత్ప, మానిక్ బండార్,ఆర్టీసీ కాలనీ,దాస్ నగర్,బొర్గం కే, మండల వ్యాప్తంగా గ్రామంలోని వ్యాప్తంగా రద్దీగా ఉండే దేవాలయాలు, తాళం వేసిన ఇండ్లన్నీ టార్గెట్గా చేసి దొంగతనాలు జరిగాయి .ఎటు తేల్చని ఐడి స్పెషల్ పార్టీ బృందాలు దొంగతనాలు జరగగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవడానికి పరిమితంగా మారింది ఈ వారం వ్యవధిలో రెండుసార్లు బైక్ చోరీలు జరిగాయి వారం వ్యవధిలో ఆర్టీసీ కాలనీలో అలాగే మాణిక్ బండార్ బైక్ చోరీలకు పాల్పడ్డారు బుధవారం రాత్రి మాక్లూర్ మండలంలోని బొంకన్ పల్లి గ్రామంలో రాత్రి లో గుర్తుతెలియని వ్యక్తులు రెండు హెచ్ఎఫ్ డీలక్స్ల బైకులను అపహరించారు గ్రామంలోని వెంకటేష్ గౌడ్, గందల ప్రశాంత్ ప్రతిరోజు మాదిరిగానే తన ఇంటి ముందు బైకులను ఉంచి నిద్రించేవారు ఉదయాన్నే లేచి చూసేసరికి బైకులు కనిపించలేదు దీంతో గ్రామంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరీక్షించగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి రెండు బైకులను అపహరించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో వెంకటేష్ గౌడ్,గందల ప్రశాంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు అపరించిన వ్యక్తులను సీసీ కెమెరాలు ఆధారంగా తొందర్లో పట్టుకుంటామని ఎస్సై సుధీర్ రావు తెలిపారు మండల వ్యాప్తంగా రోజురోజుకు దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్న పోలీస్ వ్యవస్థలో ఎటువంటి చలనం లేదు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయాల్సి ఉండగా వారు చేసిన దాఖలాలో అయితే కనిపించడం లేదని మండల వ్యాప్తంగా ప్రజలు పోలీస్ వ్యవస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి మండల వ్యాప్తంగా దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు.