లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మాక్లుర్ మండల జీవన్ రెడ్డి యువసేన అధ్యక్షుడు గోపు రంజిత్,సర్పంచ్ శేఖర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.. మాక్లుర్ మండలంలోని గుంజిలి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గ్రామ సర్పంచ్ శేఖర్ యువ నాయకులు గోపు రంజిత్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా తెరాస నాయకుడు గోపు రంజిత్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే,పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డీ సహకారంతో చెక్కులు మంజూరు అయ్యాయని తెలిపారు.ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందిన నవతే శ్రీలేఖ 28000,దుమల సతీష్ 44000 రూపాయలు చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డీకీ కృతజ్ఞతలు తెలియజేశరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్, గోపు రంజిత్,సుధాకర్ రాజు ,సాయన్న,తదితరులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.