సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివాస్ గా జరుపుకుంటారు ఇందుగల కారణం1949 నా సెప్టెంబర్ 14న తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుండి ఈ తేదీన హిందీ దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీ. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడతారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన భాష హిందీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను హిందీ అక్షరాల ఆకారంలో కూర్చోబెట్టడం జరిగింది ఇది పలువురిని ఆకర్షించుకుంది. కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.