డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్‌ను అమలుచేస్తారు.
డిగ్రీలో విద్యార్థుల అటెండెన్స్‌కు మార్కులు వేసే నూతన విధానాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలులో భాగంగా విద్యార్థుల అటెండెన్స్‌కు క్రెడిట్స్ జారీ చేస్తారు. దీంతో విద్యార్థులు తరగతులకు హాజయ్యేందుకు ఉత్సాహం చూపుతారని అధికారులు భావిస్తున్నారు. పాఠ్యాంశాలను బట్టి పట్టడానికి స్వస్తి పలికి.. క్లాస్‌రూంలో కుస్తీ పట్టేలా సంస్కరణలను తెస్తున్నారు. ఫలితంగా ఇంటర్నల్స్.. సెమిస్టర్ పరీక్షల మార్కులు మారిపోతాయి. 50 శాతం మార్కులను సెమినార్లు, ఫీల్డ్ స్టడీ విజిట్స్ వంటి వాటి ద్వారా కేటాయిస్తారు. మరో 50 శాతం మార్కులను సెమిస్టర్ పరీక్షలకు నిర్వహిస్తారు. గతంలో కొన్ని వర్సిటీల్లో ఇంటర్నల్స్‌కు 30 -40మార్కులు, సెమిస్టర్ పరీక్షలకు 70-60 మార్కులను అమలుచేస్తున్నారు. ఇంటర్నల్స్‌కు 50 మా ర్కులు, సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులు కేటాయిస్తారు. అన్ని వర్సిటీల్లో ఈ మార్కు ల కేటాయింపు ఒకే తరహాలో ఉండనున్నది.
ఐఎస్‌బీ నివేదికతో..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సిఫారసుల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేయాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి, వర్సిటీలు ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాయి. ఇందుకు కమిటీలను నియమించనున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు బట్టీ విధానంలో పరీక్షలు రాస్తున్నారు. సర్టిఫికెట్లు పొందుతున్నారు. కానీ వారు పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను ఆర్జించలేకపోతున్నారు. దీనికి పరిష్కారంగా సీసీఈ విధానాన్ని ప్రతిపాదించారు.
బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం
డిగ్రీ పరీక్షల మూల్యాంకనలో బ్లూమ్స్ విద్యాలక్ష్యాలను అనుసరిస్తారు. పరీక్షలను నిర్వహించి, విద్యార్థి పరిజ్ఞానాన్ని మూల్యాంకనం చేస్తారు. విద్యార్థి సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడేలా ఈ విద్యాలక్ష్యాలను రూపొందించారు. ఈ వర్గీకరణలో ఆరు స్థాయిల నైపుణ్యాలున్నాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, విశ్లేషించడం, అప్లికేషన్ (వినియోగించడం), మూ ల్యాంకనం చేయడం, సృజనాత్మకతను ప్రదర్శించడం వంటి లక్ష్యాలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని, ప్రశ్నపత్రాలు, అసైన్‌మెంట్లను సిద్ధం చేస్తారు.