భీమ్‌గల్, ఫిబ్రవరి 17
భీమ్‌గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పరి చేయడం జరిగిందని అన్నారు..స్వాగతం పలుకుతూ ఆటపాటలతో నృత్యలు చేస్తూ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సీఐ నాగపూరి శ్రీనివాస్, గెస్ట్ అఫ్ హానర్ ప్రీతీ నిగమ్, నగేష్ కర్ర , ప్రీతం సినీ ఆర్టిస్ట్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులకు పునాది దృఢంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సరైన ఆలోచన విధానంతో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సంపూర్ణ సహకారాలతో ముందుకు సాగాలని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న అత్యంత స్ఫూర్తివంతంగా ఉండాలని దాదాపు మనుషులందరికి ఇచ్చిన దేహం ఒకటే అన్నారు..అలాగే మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఎలాంటి వాహనాలు ఇవ్వకూడదని అన్నారు..అనుకోని విధంగా ఎలాంటి ప్రమాదం సంభవించిన చట్టరీత్యా పలు ఇబ్బందులను ఎదురుకోవాల్సిన ఉంటుంది కావున తల్లిదండ్రులు ఈ విషయంలో వారి సహకరించాలని కోరారు.విద్యార్థులంతా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చక్కని మార్గదర్శనని అవలంబించారన్నారు. 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతికి ప్రమోట్ అవుతున్న వాళ్లకు ఘనంగా ఈ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపుతుందని అలాగే ఈ పార్టీ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మన భీమ్‌గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు వారు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అతిక్ , వార్డ్ మెంబర్ సయ్యద్ ఇంతియాజ్,భీమ్‌గల్ పట్టణానికి చెందిన విజయ పబ్లిక్ స్కూల్ అధినేత సొంత పూరి చంద్రశేఖర్, ఆత్మీయ మిత్రుడు పల్లికొండ గంగం కిషన్, డైరెక్టర్ సన,ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ స్కూల్ ఇన్చార్జ్ బిన్ను,ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…