భీమ్ గల్ పట్టణానికి విచ్చేసిన కేరళ తాంత్రి
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
తేది :12. ఫిబ్రవరి
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ మహా సంప్రోక్షణ, కుంబాబీశేక కార్యక్రమనికి కేరళ నుండి బ్రహ్మ శ్రీ కంఠరారు మహేశ్వరన్ మోహనర్ తాంత్రి భీమ్గల్ పట్టణానికి చేరుకున్నారు.వారికీ అయ్యప్ప సేవా సమితి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారిని కోసం ప్రత్యేక పూలతో అలంకరించిన వాహనం లో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక వాహిధ్యాలతో, నృత్యలతో అంగరంగ సాగిన ఊరేగింపు అయ్యప్ప ఆలయం వద్ద ముగిసింది. ఆలయానికి చేరుకున్న తాంత్రి ,గారికి అయ్యప్ప ఆలయ పూజారి పున్నం స్వామి ఆలయం లోకీ అర్చన, హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఇట్టి కార్యక్రమం లోవేద పండితుడు, నంబి వాసుదేవచార్యులు, పవన్ శర్మ,అయ్యప్ప సేవాసమితి, అయ్యప్ప భక్తులు, గ్రామ కమిటీ, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు, పాల్గొన్నారు.