జాతీయ రహదారి 44 పై ట్రక్టర్ ను కంటైనర్ డి….
ఇద్దరు మృతి, పలువురికి గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని చాంద్ మియబాగ్ జాతీయ రహదారి 44 పై సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రాక్టర్ ను కంటేనార్, డీకోట్టిన ఘటనలో డిచ్ పల్లి మండలం అమృతపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ (30), ఒడ్డెన్న (35) ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరికి గాయాలు అయినట్లు, జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ట్రక్టర్ పై జక్రాన్ పల్లి నుండి డిచ్ పల్లి వైపు పశువుల కోసం జొన్న గడ్డి తో వెళ్తుండగా చందా మీయభాగ్ వద్ద, జాతీయ రహదారి 44 పై ట్రక్టర్ ను వెనుకల నుంఢి కంటేనర్ డీ కొట్టడంతో ప్రమాద స్థలంలో ఒడ్డెన్న మృతి చెందగా, రాజేశ్వర్ 108 సహాయంతో ఆస్పత్రికి తరలించంగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు EMT అకేష్, పైలెట్ నరేష్, తెలిపారు. మరొ ఇద్దరు విజయ్ మహేష్ లకు గాయాలు అయ్యాయని ఆయన తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు.