*ఆశ హాస్పిటల్ పై బురద చల్లె ప్రయత్నం….

*ఎమర్జెన్సీ చికిత్స అందించడం నేరమా….

*మీడియా సమావేశంలో ఆశ ఆసుపత్రి వైద్యులు….

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆశ హాస్పిటల్ లో ఆదివారం రోజు ఆసుపత్రి వైద్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ బాల్ రెడ్డి, డాక్టర్ శేఖర్ రెడ్డి, లు మాట్లాడుతూ, మా ఆసుపత్రి పై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాపై లేని పోని ఆరోపణలు చేస్తూ మా ఆసుపత్రిని అభాసుపాలు చేస్తున్నారన్నారు. ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామానికి చెందిన బద్ధం చిన్నారెడ్డి, 45 సంవత్సరాల వయసు గల పేషంట్ జనవరి 8 వ తేదీన మావద్ధకు కడుపు నొప్పితో రావడం జరిగిందన్నారు. ఇక్కడికి రాక ముందే పలు ఆసుపత్రులకు వెళ్ళడం జరిగిందన్నారు. రెండు ప్రక్కల రెండు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిపారు. అతని వ్యక్తిగత కారణాల వలన చికిత్స చేసుకోలేదు మా వద్దకు రావడం జరిగిందన్నారు. తో గత నెలలో వైద్యం కోసం ఆశ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. రెండు కిడ్నీలను పరీక్షించి ఎడమ వైపు కిడ్నీలో స్టోన్ పెద్దగా ఉంది కావున మొదట దానికి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఇక్కడి నుండి 13వ తేదీన చక్కని ఆరోగ్యతో ఇంటికి వెళ్ళడం జరిగిందన్నారు. మల్లి 17వ తేదిన రివ్యూకు రావడం జరిగిందన్నారు. తిరిగి రెండో కిడ్నికి 24 వ తేదీన ఆపరేషన్ చేయడానికి రమ్మని చెప్పిన తాను తన వ్యక్తిగత కారణాల వలన రాలేదని చెప్పారు. అతనికి ఇన్ఫెక్షన్ వచ్చిన తరువాత ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించడం జరిగిందన్నారు. అయినా అతనికి సిరియస్ కావడంతో వారు హైదారాబాద్ వెళతాం అంటే మా ఆసుపత్రి అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచిస్తే పంపడం జరిగిందన్నారు. అక్కడ చికిత్స పొందడం జరిగింది. మేము చేసిన పొరపాటు ఏమి లేదు అయినా మా ఆసుపత్రి పై వారి కుటుంబ సభ్యులు లేని పోని ఆరోపణలు చేస్తూన్నారు. మా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు అన్నారు. మేము వాస్తవాలు ప్రజలకు తెలియాలే అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *