*ఆర్మూర్ పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద ప్రజా యుద్ధ నౌక
గద్దర్ కి ఘన నివాళిలు
దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న మాట్లాడుతూ గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు ఆయన ఆట పాటలతో తెలంగాణ ప్రజలను తనదైన శైలిలో ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయన కే దక్కుతుందన్నారు గద్దర్ తో 1982 నుండి 1984 మధ్య కాలంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రం లో గుంటూరు జిల్లా మాచర్ల లో విరసం సమావేశాల్లో అయన జననాట్య మండలిలో, ఆయనతో కాలుకు గజ్జె కట్టి నాట్యం చేసిన జ్ఞాపకాలు కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని అలాంటి ప్రజల గొంతుక ఇక లేదనే విషయం జీర్ణించుకోలేక పోతున్నాం అని అన్నారు. అందుకే తెలంగాణ సాధనలో బాగాస్వామి అయి నటువంటి అన్ని వర్గాల బంధువు గద్దర్, విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై. నెలకొలిపి గద్దర్ చరిత్ర ను ప్రపంచానికి తెలిపే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వందే అని అన్నారు. కేసీఅర్ అనుకుంటే జరిగేది ఎది లేదని అందుకే కేసీఅర్ స్పందించి వెంటనే గద్ధర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ పై నెలకొల్పాలని భుమన్న విజ్ఞాప్తి చేశారు. అలాగే మూగ ప్రభాకర్ మాట్లాడుతూ గద్దర్ ఒక దళిత సమస్యల మీదనే. పోరాటాలు చేయలేదని ఎస్ టి, బిసి, సంక్షేమం కోసం అనేకఅంతర్జాతీయ పోరాటాలు చేశారని బడుగు బలహీన వర్గాలకు అండగ ఉన్న వ్యక్తి గద్ధర్ అని అన్నారు. గద్దర్ ఆశయాలు పాటలు, భూమి ఉన్నంత వరకు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సదానందం, ఎల్.టి. కుమార్, పెద్ద బోజాన్న, పెద్ద దేవయ్య, గాంగాని స్వామీ, తుడుం రాఖేష్, సామ్రాట్, వెన్న రమేష్, చందు, జిజి రాం, సంజీవ్, బాబు, తదితరులు పాల్గొన్నారు