నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్లో పాత భాషిత స్కూల్ దగ్గరలో ఉన్న సుమారు 2700 గజాలు పక్కకు పాత భాషిత స్కూల్ యజమాని సువర్ణ మరియు మరో పక్క బండారి నరేందర్ వీరిద్దరూ యజమానిలు పెర్కిట్ గ్రామపంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. తూర్పు వైపు 33 ఫీట్ల రోడ్డు ఉన్నట్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పాత భాషిత స్కూల్ వైపు ఉన్న రోడ్డు 15 ఫీట్ల రోడ్డు వదిలి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కబ్జాలో ఉన్నటువంటి డాక్టర్ ముత్యం రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు 15 ఫీట్లు వదలకపోగా వదిలిన 15 ఫీట్లను కబ్జా చేస్తూ నిర్మాణం చేయడం జరుగుతున్నది, దీనిపై స్పందించాలని మున్సిపల్ కమిషనర్ కి మరియు పై అధికారులకి కూడా ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరి వీరికి ముడుపులు అందుతున్నాయా లేక వీరు ఇంకేమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం గమనార్థం ఆర్మూర్ మున్సిపాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా తయారైందని వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా తయారయ్యారని ఎద్దేవా చేయడం జరిగింది. ఈ కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తి నాకు రాష్ట్ర నాయకులు పరిచయమన్నారు రాష్ట్ర నాయకులు దీంట్లో భాగస్వాములై ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావున నేను యజార్చగా కబ్జా చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది సుమారు కోటి రూపాయలు విలువచేసే స్థలాన్ని కబ్జా చేస్తున్న పట్టించుకోకపోవడం విడ్డూరం పేదలు ఏదైనా ఫిర్యాదు చేస్తే వాటిపై స్పందించే వారు లేకపోవడం జిల్లా కలెక్టర్ ఇకనైనా కలగజేసుకొని ఈ సమస్యపై వెంట వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారమే ఈ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నాము 2023 ఎలక్షన్లలో ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని కచ్చితంగా ఓడిస్తారని చెప్పేసి ఈ ముఖంగా చెప్తున్నాను.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు ఆరే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.