నిజామాబాద్ A9 news
ఆర్మూర్ డివిజన్ లోని ప్రతీ బ్రాంచ్ పోస్టాఫీసులలో అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా జెండా ఉత్సవాలను సోమవారం ప్రారంభించడం జరిగింది.ఎస్ ఎస్పీవోస్ అనిల్ కుమార్ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో 20×80 అంగుళాలు గల జాతీయ జెండాలను 25 రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నారు.

అలాగే ప్రతీ గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ప్రజలకు అందుబాటులో ఈ రోజు నుండి జెండాలు అమ్మకానికి సిద్ధంగా చేస్తున్నట్లు తెలిపారు.జెండాలు కావలసినవారు ఆన్ లైన్ ద్వారా www.epost office.gov.in వెబ్సైట్లో కూడా ఆర్డర్ చేయవచ్చునని,ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వారికి తమ ఏరియా పోస్ట్ ఆఫీస్ ద్వారా డెలివరీ చేయబడునని,విద్యా సంస్థలు ప్రైవేట్ / ప్రభుత్వ సంస్థలలో ఎక్కువ మొత్తంలో జెండాలు అవసరమున్నవారు తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించగలరని తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *