horoscope today 06 August 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆదివారం రోజున చంద్రుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…
horoscope today 06 August 2023 ఈరోజు ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మిధునం, కర్కాటక రాశుల వారికి పనులకు సంబంధించి మెరుగైన ఫలితాలొస్తాయి. అంతేకాదు కొత్త పనులకు సంబంధించి కొన్ని ప్రణాళికలను రూపొందిస్తారు. మరోవైపు మేష రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే మీరు భవిష్యత్తులో ఆందోళన చెందాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు. ఈరోజు సాయంత్రం మీ తండ్రి ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించి కొన్ని ప్రణాళికలను రూపొందిస్తారు. మీ మనసులో ఏదైనా ఆలోచన వస్తే, వెంటనే దాన్ని ముందుకు తీసుకెళ్లండి. దీని వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మరోవైపు మీ ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. లేదంటే మీ శత్రువులు దాన్నుంచి బయటపడతారు. ఏదైనా ఆస్తికి సంబంధించి వివాదం జరుగుతున్నట్లయితే, అది ఈరోజు ముగుస్తుంది.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు సృజనాత్మక పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ స్వభావంలో ఉల్లాసంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారు మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ శక్తి పెరుగుతుంది. ఈరోజు మీకు ఇష్టమైన పనిని చేయాలి. మీరు ఏ పని చేయాలని ప్రయత్నించినా అందులో మీరు కచ్చితంగా విజయం సాధించగలరు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల మాటలు విన్న తర్వాత విచారంగా ఉండొచ్చు.
ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించి ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారు. మీ తోటి ఉద్యోగులు కలత చెందుతారు. ఇలాంటి సమయంలో వారితో మాట్లాడి.. అన్నింటినీ సర్దుబాటు చేసుకోవాలి. వ్యాపారులు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు మీరు పసుపు వస్తువులను దానం చేయాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు మతపరమైన, సామాజిక కార్యక్రమాల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మీరు మీ ముఖ్యమైన పనిని వాయిదా వేయకూడదు. ఈరోజు సాయంత్రం మీ బంధువుల ఇంటికి వెళ్లొచ్చు. విద్యార్థులకు గురువుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. మీరు ఏదైనా పోటీల్లో పాల్గొంటే అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడికి సంబంధించి కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా, మీరు అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డబ్బును పొందడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చించుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లొచ్చు.
ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం వాయిదా వేయాలి. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. దీని వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా వారు తమ చెడిపోయిన పనిని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు మీ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు షాపింగ్ కూడా చేయొచ్చు.
ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ పూర్తవుతాయి. మీకు రోజంతా లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. మీరు సామాజిక కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఈరోజు మీరు మీ బంధువులు, పొరుగువారి గందరగోళంలో చిక్కుకోవాల్సిన అవసరం లేదు.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారిలో వ్యాపారులు నష్టాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అనుభవం ఉన్న వారి నుంచి సలహాలు తీసుకోవాలి. మరోవైపు ఉన్నతాధికారుల మద్దతుతో ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు కొన్ని బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా గడుపుతారు.
ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారిలో వ్యాపారులకు గొప్ప లాభాలొస్తాయి. మీరు ఇంటి పనులను పరిష్కరించుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తప్పులు జరిగే అవకాశం ఉంది.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేద ప్రజలకు సహాయం చేయాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు, అధికారులకు ఏమైనా విభేదాలు ఉంటే, అవి నేటితో ముగిసే అవకాశం ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఉపాధికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, అది ఇప్పుడు పరిష్కరించబడుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. విద్యార్థులకు విద్యా రంగంలో సానుకూల ఫలితాలు రానున్నాయి.
ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ పరంగా మీకు కొన్ని సమస్యలు రావొచ్చు. ఈరోజు మీరు ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించాలి. మీకు ఇబ్బందిగా ఉన్న వాటిని తినకూడదు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా రిస్క్ తీసుకుంటే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జప మాలను పఠించాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.