ఆర్మూర్లో పది రూపాయలకే షర్టు – జనాల రద్దీతో హల్‌చల్…

On: Thursday, August 21, 2025 4:19 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో గురువారం అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తాలోని ఓ కాంప్లెక్స్‌లో ఉన్న “పంకీ బాయ్స్” బట్టల షాపు యాజమాన్యం 250 రూపాయల విలువ గల షర్టులను కేవలం 10 రూపాయలకే అమ్ముతామని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన ఇచ్చింది.

ఈ ఆఫర్ తెలిసిన వెంటనే యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో షాపు వద్దకు చేరుకున్నారు. ఒక్క షర్ట్ కోసం క్యూలు కడుతూ ఎగబడటంతో అక్కడ ఒకసారిగా రద్దీ పెరిగింది.

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని జనాలను క్రమబద్ధీకరించారు. ఈ విపరీతమైన రద్దీ ఆ ప్రాంతంలో హల్‌చల్‌గా మారింది.

03 Nov 2025

Leave a Comment