ఘనంగా వాసవి మాతాకు పంచామృతాభిషేకం
కుంకుమార్చన, ప్రత్యేక పూజలు
భీమ్ గల్, సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ శ్రీ వాసవి మాత ఆలయంలో శుక్రవారం ఘనంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మార్కండేయ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి,సుహాసినిలచే కుంకుమార్చన, మంగళ హారతి కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం ముత్తాయివుదలు శ్రీ వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేశారు. తదనంతరం భక్తులకు ఆలయ ప్రాంగాణం లో సంఘం ఆధ్వర్యంలో అల్పాహర కార్యక్రమం నిర్వహించారు.ఇట్టి బృహత్తర కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు లభిషేట్టి సురేష్, ఉపాధ్యక్షులు గారిపెల్లి సుదర్శన్, కోశాధికారి నవతా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు దేవరశెట్టి శ్రీనివాస్, లింగం,పల్లికొండ రమేష్, నిఖిల్ రాజు, పుల్లూరి బాలకిషన్, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పల్లికొండ మౌనిక మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.